Haryana election: హర్యానాలో బీజేపీ రెండో జాబితా రిలీజ్.. వినేష్ ఫొగట్‌పై పోటీ చేసేది ఆయనే?

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది.

Update: 2024-09-10 12:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ లిస్టులో 21 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీంతో మొత్తం 90 స్థానాలకు గాను ఇప్పటి వరకు 87 అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 67 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్‌ను ఖరారు చేసింది. తాజా జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ బదోలీ, ఇద్దరు మంత్రులతో సహా ఏడుగురు ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేసింది. ఇద్దరు ముస్లింలు, ఇద్దరు మహిళా అభ్యర్థులకు అవకాశమిచ్చింది. అంతేగాక గతసారి పోటీ చేసిన 9 మంది అభ్యర్థులను మార్చింది.

జులానా సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగనున్న రెజ్లర్ వినేష్ ఫొగట్‌పై కెప్టెన్ యోగేష్ బైరాగిని పోటీలో నిలిపింది. యోగేష్ ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, హర్యానా స్పోర్ట్స్ సెల్ కో-కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై ఉత్కంట నెలకొంది. ఇటీవల బీజేపీకి మిత్రపక్షంగా మారిన పలువురు నాయకులకు సైతం టిక్కెట్లు దక్కాయి. ముస్లిం అభ్యర్థుల్లో ఫిరోజ్‌పూర్ జిర్కా నుంచి నసీమ్ అహ్మద్, పున్హానా నుంచి ఎజాజ్ ఖాన్‌లకు చాన్స్ ఇచ్చింది. కాగా, హర్యానాలో నామినేషన్లకు ఈ నెల 12వరకు చివరి తేదీ కాగా.. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. 


Similar News