Train Accident: UPలో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

ఇటీవ‌లకాలంలో దేశంలో వరుస రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-18 20:51 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఇటీవ‌లకాలంలో దేశంలో వరుస రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో రైల్లో ప్ర‌యాణించాలంటేనే చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రైలు ప్ర‌యాణాల‌నే ఎంపిక చేసుకుంటున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో రైలు ప్ర‌మాదాలు జ‌రిగినా, వాటి నివార‌ణ‌కు మాత్రం రైల్వే అధికారులు తగిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో రైలు పట్టాలు(train derailed) తప్పిన ఘటన బుధవారం రాత్రి 8 గంటలకు చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..UPలోని బృందావన్ రోడ్(Brundavan Road) స్టేషన్ సమీపంలో బొగ్గు లోడు(coal-loaded)తో వెళ్తున్న ఓ గూడ్స్ ట్రైన్(Goods Train) ప‌ట్టాలు త‌ప్పింది.దీంతో 20 బోగీలు(20 wagons) చెల్లాచెదురుగా పడిపోయాయి.వెంట‌నే సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టారు.గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఢిల్లీ(Delhi)-మథుర(Mathura) మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) రైల్వే జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 


Similar News