ఈ స్పిరిట్ మీలో ఉందా? ఆక్సిజన్ మాస్క్‌తో వచ్చి ఓటు వేసిన బామ్మ!

తమ ఓటు హక్కును వినియోగించుకోండని ఎంత చెప్పినా కూడా కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. కానీ ఓ బామ్మ లేవలేని స్థితిలో ఉన్న కూడా పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంది.

Update: 2024-06-01 08:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమ ఓటు హక్కును వినియోగించుకోండని ఎంత చెప్పినా కూడా కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. కానీ ఓ బామ్మ లేవలేని స్థితిలో ఉన్న కూడా పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంది. ఇందులో ఆశ్చర్యం ఏముందని అనుకుంటున్నారా? తను ఆక్సిజన్ సిలిండర్‌ మాస్క్‌తో వచ్చి ఓటువేసి అందరికీ స్పూర్తినిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం తన ట్విట్టర్ వేదిక ద్వారా పోస్ట్ చేసింది. సార్వత్రిక ఎన్నికలు చివరి దశ పోలింగ్ సందర్భంగా ఇవాళ 8 రాష్ట్రాలు, యూటీలలోని 57 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ నడుస్తుంది.

అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో బిలాస్‌పూర్ జిల్లాలోని చువాడి పోలింగ్ బూత్‌లో విమల శర్మ అనే బామ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆక్సిజన్ సిలిండర్‌ వెంట తెచ్చుకోని మరి తన ఓటు వేశారు. బామ్మ ఓటు వేసే క్రమంలో కుటుంబ సభ్యులు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకోని ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బామ్మ ఉన్న స్థితిని కూడా పట్టించుకోకుండా తను ఓటు వేయడం పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News