ఇండియాలో యూజ‌ర్ కంప్లైంట్స్ బాడీపై Googleకి తీవ్ర అభ్యంత‌రాలు

ప్రభుత్వంతో పరస్పర చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. Google opposes Facebook-backed proposal for self-regulatory body.

Update: 2022-08-12 09:51 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః వినియోగదారుల ఫిర్యాదులను వినడానికి భారతదేశంలో సోషల్ మీడియా విభాగం కోసం సెల్ఫ్‌-రెగ్యులేట‌రీ బాడీని అభివృద్ధి చేసే ప్రతిపాదనను గూగుల్ వ్యతిరేకించిందని వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల మద్దతు లభించినప్పటికీ, గూగుల్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో కంటెంట్ నియంత్రణ నిర్ణయాల గురించి వినియోగదారుల నుండి ఫిర్యాదులను వినడానికి ప్రభుత్వ ప్యానెల్‌ను నియమించాలని భార‌త ప్ర‌భుత్వం ప్రతిపాదించింది. కంపెనీలు సిద్ధంగా ఉంటే స్వీయ నియంత్రణ బాడీ రూప‌క‌ల్ప‌న చేసే ఆలోచన అమ‌లుచేయొచ్చ‌ని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. అయితే, టెక్ దిగ్గజాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ప్రభుత్వ ప్యానెల్ ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని రాయిట‌ర్స్ వెల్ల‌డించింది. 'అత్యుత్తమమైన పరిష్కారం కోసం మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని' Google ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే, తాము ఒక ప్రాథమిక సమావేశానికి హాజరైనట్లు, కంపెనీతోనూ, ప్రభుత్వంతోనూ పరస్పర చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి : Google మీ డేటా సేకరిస్తే.. బీప్ సౌండ్‌తో అలర్ట్ చేసే యాప్


Similar News