సుందర్ పిచాయ్ ఇల్లు అమ్మకం.. కన్నీరు పెట్టుకున్న తల్లీదండ్రులు
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కుటుంబానికి చెందిన ఇల్లును అమ్మకానికి పెట్టారు.
దిశ, వెబ్ డెస్క్: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కుటుంబానికి చెందిన ఇల్లును అమ్మకానికి పెట్టారు. దీంతో సుందర్ పిచాయ్ తల్లీదండ్రులు లక్ష్మీ, రఘునాథ పిచాయ్ కన్నీరుపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం చెన్నయ్ లోని అశోక్ నగర్ లో గూగుల్ సీఈవో కుటుంబానికి సొంత ఇల్లు ఉంది. అయితే ఆ ఇంటిని ప్రముఖ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సీ మణికందన్ కొనుగోలు చేశాడు. కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వగైరా పనులను పిచాయ్ తండ్రి దగ్గరుండి చూసుకున్నారు. ఇక ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇంటిని వేరే వ్యక్తికి అమ్మడంతో వారు ఎమోషనల్ అయ్యారు. రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చే సమయంలో పిచాయ్ తల్లీదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు. కాగా సుందర్ పిచాయ్ ఈ ఇంట్లోనే 20 ఏళ్ల వయసొచ్చే వరకు ఉన్నారు.
అనంతరం ఖరగ్ పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫారిన్ వెళ్లిపోయారు. అయితే ఇండియాకు వచ్చినప్పుడల్లా సుందర్ పిచాయ్ తన పుట్టింటికి వచ్చేవారు. ఇక ఇల్లు అమ్మడంతో ఆయన ఇక్కడకు రావడం కష్టమేనని సన్నిహితులు చెబుతున్నారు. కాగా సుందర్ పిచాయ్ పుట్టిపెరిగిన ఇల్లును కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని మణికందన్ చెప్పారు. కాగా ప్రస్తుతం గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ జీతం ఇతర అలవెన్స్ ల రూపంలో ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. తమిళనాడులోని ఇల్లు అమ్మేసి తల్లిదండ్రులను పర్మనెంట్ గా యూఎస్ తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.