రైతులకు గొప్ప శుభవార్త.. పీఎం కిసాన్‌ 18వ విడత డబ్బులు పడేవి అప్పుడే..!

Update: 2024-09-06 06:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం పీఎం కిసాన్ (Pradhan Mantri Kisan Samman Nidhi) పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా రూ.6 వేలు అందిస్తారు. నాలుగు నెలలకోసారి, ఏటా మూడు విడతలుగా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు. అయితే ఇప్పటికే 17 సార్లు నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. ఇప్పుడు 18వ విడత డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 2024, అక్టోబర్‌లో 18వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.

కాగా 17వ విడతను జూన్ 2024 లో వారణాసిలోని 9.26 కోట్ల మందికి పైగా రైతులకు 17వ విడతగా రూ.21,000 కోట్లకు పైగా ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ విడతను ఉత్తరప్రదేశ్‌లో జూన్ 18, 2024న విడుదల చేయగా, 16వ విడత ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది.

వాయిదా కోసం e-KYC అవసరం:

ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, PMKISANలో నమోదు చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి. OTP-ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది. లేదా బయోమెట్రిక్ eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.


Similar News