ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఆ నిబంధనలు సవరించిన కేంద్రం?

సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే తల్లులు, ఆ పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-06-23 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే తల్లులు, ఆ పిల్లలను దత్తత తీసుకునే తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972ని సవరించింది. దీని ప్రకారం..అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగి అయిన కమీషనింగ్ మదర్‌కు కూడా ఈ సెలవులు లభిస్తాయి. అంతేగాక సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులకు కూడా ప్రభుత్వం అనుమతించింది. పురుష ఉద్యోగులకు సరోగసీ విషయంలో బిడ్డ జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవును ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అతనికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేయగా.. జూన్ 18 నుంచే ఇవి అమలులోకి వచ్చాయి.


Similar News