Goa CM Wife : ఆప్‌ ఎంపీపై రూ.100 కోట్లకు సీఎం భార్య పరువునష్టం దావా

దిశ, నేషనల్ బ్యూరో : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌(Sanjay Singh)పై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ భార్య (Goa CM wife) సులక్షణ సావంత్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా(defamation case) వేశారు.

Update: 2024-12-17 15:47 GMT
Goa CM Wife : ఆప్‌ ఎంపీపై రూ.100 కోట్లకు సీఎం భార్య పరువునష్టం దావా
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌(Sanjay Singh)పై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ భార్య (Goa CM wife) సులక్షణ సావంత్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా(defamation case) వేశారు. ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లో ఉన్న సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ కోర్టులో ఆమె దావా పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో ఆ కోర్టు నుంచి సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 10కల్లా సమాధానం ఇవ్వాలని ఆయనకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గోవాలో లంచాలు పుచ్చుకొని ఉద్యోగాలు అమ్ముకున్న కుంభకోణంలో సులక్షణ సావంత్ పాత్ర ఉందని ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ సింగ్‌ కామెంట్ చేశారు. ఈ ఆరోపణ వల్ల తన పరువుకు నష్టం కలిగించినందుకు రూ.100 కోట్ల పరిహారం చెల్లించేలా సంజయ్ సింగ్‌కు ఆదేశాలివ్వాలని కోర్టును సులక్షణ సావంత్ కోరారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సంజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News