న్యూఢిల్లీ: మరోసారి చర్చనీయాంశంగా మారిన పెగాసస్ స్పైవేర్ వినియోగంపై సుప్రీం కోర్టులో నూతన పిటిషన్ దాఖలైంది. న్యాయస్థానం దీనిపై న్యూయార్క్ టైమ్స్ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని మరియు ఇజ్రాయెల్‌తో 2017 రక్షణ ఒప్పందంపై విచారణకు ఆదేశించాలని కోరింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పెగాసస్ స్పైవేర్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ జరిపించాలన్నారు.
న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజా నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టును కోరారు. 2017 లో భారత ప్రభుత్వం 2 బిలియన్ల డాలర్లతో రక్షణ ఒప్పందంలో పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసిందని వార్త కథనం పేర్కొంది. దీనిపై విపక్షాలు కేంద్రం పై విమర్శలకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానిది మోసమని ఆరోపించాయి. మరోవైపు కేంద్రం పై కాంగ్రెస్ సీనియర్ నేత ట్విట్టర్ ద్వారా విమర్శలకు దిగారు. ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ అధునాతన వెర్షన్ ను కొనుగోలు చేయాలని ప్రధాని మోడీని చిదంబరం కోరారు.