TANA : తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు !

అమెరికా(America)లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు(California District Court) నోటీసు(Notices)లు జారీ చేయడం కలకలం రేపింది.

Update: 2025-01-07 11:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు(California District Court) నోటీసు(Notices)లు జారీ చేయడం కలకలం రేపింది. 2019 నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు, లావాదేవీలు, విరాళాల వివరాలు ఇవ్వాలని నోటీసులో కోర్టు పేర్కొంది. డిసెంబర్ 12న నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 26న పూర్తి సమాచారంతో డిస్ట్రిక్ట్ కోర్టు హౌస్ సాంగ్ జోష్‌లో తానా నిర్వాహకులు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు, ఎలక్ట్రానిక్‌ డేటా, తానాలోని సభ్యుల వివరాలు కూడా తీసుకురావాలని..ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఆ సమాచారాన్ని ఎఫ్ బీఐ(FBI)కి కూడా మెయిల్‌ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే తానాలో జరిగిన అవతవకలపై ఎఫ్ బీఐ విచారించింది. రూ.30కోట్ల గోల్ మాల్ లో కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ కొంత సొమ్మును తానాకు జమచేశారు.

అమెరికాలోని తెలుగు సంఘాలతో కొందరు తెలుగు టెకీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడమే కోర్టు నోటీసులకు దారితీసింది. ఆపిల్‌ గ్రాంట్ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై.. ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించవచ్చనే భయందోళనలు నెలకొన్నాయి.

ఆపిల్‌ గ్రాంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు.. ఉద్యోగుల సొంత ఖాతాలకు మళ్లించినట్లు ఆపిల్ సంస్థ నిర్ధారించింది. దాంతో నిధుల కుంభకోణంపై ఎఫ్ బీఐ, అమెరికా కోర్టులు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం తానాకు నిరంజన్ సంఘవరపు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో తెలుగు సంఘాలు రకరకాలుగా విడిపోయాయి. గతంలో నాటాపైన అనేక ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు దానిని మూసివేశాయి. ఇప్పుడు తానాకు కూడా అదే గతి పట్టవచ్చన్న ఆందోళన అక్కడ ఉన్న తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది. 

Tags:    

Similar News