రాష్ట్రంలో కరోనా ఫోర్త్ వేవ్.. హెచ్చరిస్తున్న లెక్కలు..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. భారీ ప్రమాదం నుంచి
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. భారీ ప్రమాదం నుంచి బయటపడుతున్నాము అని అనుకునేలోపే కరోనా నాలుగో వేవ్ ఆనవాల్లు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే గత వారం క్రితం తక్కువ సంఖ్యలో పెరుగుదల లేదు.. కానీ వరుసగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో సోమవారం 1,036 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో మహారాష్ట్రలో నాలుగో వేవ్ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. అంతకు ముందు సెకండ్ వేవ్‌లో సమయంలో మహారాష్ట్ర మొత్తం కరోనాతో అల్లాడిపోయింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 78,94,233 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరణాల సంఖ్య 1,47,866 చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 7,429 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 35 జిల్లాల్లో, కొల్హాపూర్, ధూలే, నందుర్బార్, బుల్దానా, గోండియా మరియు జల్నా అనే ఆరు జిల్లాల్లో సున్నా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
వాణిజ్య పరంగా నిత్యం దేశ విదేశాలు నుంచి ముంబై, పూనే మహానగరాలకు వచ్చే వారు అధిక సంఖ్యలో ఉంటారు. అధికంగా వారి నుంచే పెద్ద ప్రమాదం ఉంది. అయితే ఓమిక్రాన్ వేరియంట్ సమయంలో ఎంతో బయపడినప్పటికీ పెద్దగా ప్రమాదం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరి నాలుగో వేవ్ అంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.