Food poisoning. : స్కూలులో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని కేకేట్ జల్గావ్ గ్రామంలోని పాఠశాలలో 80 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-08-18 12:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని కేకేట్ జల్గావ్ గ్రామంలోని పాఠశాలలో 80 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. పౌష్టికాహార భోజన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 8:30గంటలకు విద్యార్థులు బిస్కెట్లు తిన్నారు. ఆ తర్వాత వారికి వాంతులు ప్రారంభమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే, స్థానికులు, ఇతర అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మొత్తం 257 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని వైద్యాధికారులు తెలిపారు. 153 మందిని ఆస్పత్రికి తీసుకురాగా, కొందరిని చికిత్స నిమిత్తం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించారు. తీవ్రమైన లక్షణాలు కనిపించిన ఏడుగురు విద్యార్థులను తదుపరి చికిత్స కోసం ఛత్రపతి సంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. 

Tags:    

Similar News