Chief Minister : కుమారి సెల్జానే సీఎం అవుతారా ? భూపిందర్ సింగ్ హుడా రియాక్షన్ ఇదీ

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-07 13:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు ?’’ అని ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆ విషయాన్ని పార్టీ హైకమాండే నిర్ణయిస్తుంది’’ అని తేల్చి చెప్పారు. ఇలాంటి కల్పిత ప్రశ్నలకు సమాధానాలను చెప్పలేమన్నారు. ‘‘కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా కూడా సీఎం రేసులో ఉన్నారు కదా ? ’’ అని హుడాను అడగగా.. ‘‘ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరు సీఎం పోస్టును ఆశించవచ్చు. మీరు కూడా ఆ పదవిని కోరుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేలు, హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు’’ అని బదులిచ్చారు.

ఇక హర్యానాలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా వివరణ ఇచ్చారు. ‘‘సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. తొలుత కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశాలను నిర్వహిస్తాం. వాటిలో తీసుకునే నిర్ణయాలను హైకమాండ్‌కు తెలియజేస్తాం. తదుపరిగా సీఎల్పీతో హైకమాండ్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆయన చెప్పారు.


Similar News