జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు నక్సల్స్ హతం!
జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో నెత్తురు పారింది. పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. చనిపోయిన వారి వద్ద నుంచి రెండు ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో నెత్తురు పారింది. పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. చనిపోయిన వారి వద్ద నుంచి రెండు ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. చనిపోయిన ఐదుగురు నక్సల్స్ లో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరొ ఇద్దరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నట్లు వెల్లడించారు. పక్కా సమాచారంతో పలాము-ఛత్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారు జామున ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ముగ్గురు నక్సల్స్‌ను పోలీసులు, డీఆర్జీ సంయుక్త బృందం అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన నక్సల్స్‌ను సముంద్ అలియాస్ సుమన్‌సింగ్ అంచాల (42), సంజయ్ కుమార్ ఉసెండి (27), పరశ్రమ్ దంగూల్ (55)గా గుర్తించారు.