ఇండియాలో ఒమిక్రాన్ BA.4 & BA.5 వేరియంట్ మొదటి కేసు నమోదు
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 రోజుకో రూపం దాలుస్తూ.. కొత్త వేరియంట్‌ల రూపంలో
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 రోజుకో రూపం దాలుస్తూ.. కొత్త వేరియంట్‌ల రూపంలో మరింత డేంజర్ అవుతూ వస్తుంది. ఇందులో భాగంగా.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ యొక్క BA.4 మరియు BA.5 సబ్‌వేరియంట్‌లకు సంబందించిన మొదటి కేసులు భారతదేశంలో నమోదు చేయబడ్డాయి. దీనిని భారతీయ SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ (INSACOG) వారు నిర్ధారించారు. తమిళనాడులోని 19 ఏళ్ల యువతి, హైదరాబాద్‌లోని దక్షిణాఫ్రికా యాత్రికుడు BA.4 సబ్‌వేరియంట్ సోకినట్లు నిర్ధారించబడింది. 80 ఏళ్ల తెలంగాణ వ్యక్తికి బీఏ.5 సబ్‌వేరియంట్‌కు పాజిటివ్‌గా తేలింది.
INSACOG confirms BA.4 & BA.5 variants of #COVID19 in India. pic.twitter.com/YJsoSuLt5f
— ANI (@ANI) May 22, 2022