దారుణం: ప్రభుత్వ హాస్టల్లో అగ్నిప్రమాదం.. 19 మంది విద్యార్థులు దుర్మరణం

దక్షిణ అమెరికా దేశం గయానాలో విషాదం జరిగింది. ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం జరగడంతో 19 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు.

Update: 2023-05-23 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ అమెరికా దేశం గయానాలో విషాదం జరిగింది. ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం జరగడంతో 19 మంది విద్యార్థులు సజీవ దహనంఅయ్యారు. అనేక మంది గాయపడ్డారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌కు 320KM దూరంలో ఉన్న మహ్‌దియా నగరంలోని సెకండరీ పాఠశాల హాస్టల్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 19 మంది విద్యార్థులు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గలవారని అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఘటన స్థలంలోనే 14 మంది విద్యార్థులు మరణించగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయినట్లు వెల్లడించింది. కాగా.. ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Tags:    

Similar News