కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..

Update: 2023-08-09 14:10 GMT

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న మహిళలు, సింగిల్ మేల్ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ నిమిత్తం గరిష్ఠంగా 730 రోజులు (రెండేళ్లు) సెలవులు తీసుకునేందుకు వారు అర్హులని స్పష్టం చేసింది. మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ సంరక్షణ కోసం మొత్తం సర్వీసు వ్యవధిలో గరిష్టంగా 730 రోజుల పాటు సెలవులను తీసుకోవచ్చని వెల్లడించింది. దివ్యాంగులైన పిల్లలకు ఎలాంటి వయోపరిమితి లేదని తెలిపింది.

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు ఈవివరాలను లిఖితపూర్వకంగా తెలిపారు. 6వ వేతన సంఘం సిఫార్సు ఆధారంగా చైల్డ్ కేర్ లీవ్ సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. సెలవు కాలానికి జీతం లభిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మార్చబోమని స్పష్టం చేశారు.


Similar News