Farooq Abdullah : భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చలు తథ్యం : ఫరూఖ్ అబ్దుల్లా

దిశ, నేషనల్ బ్యూరో : భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ పర్యటనపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-05 13:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ పర్యటనపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న జైశంకర్ బృందం తప్పకుండా పాకిస్తాన్- భారత్ ద్వైపాక్షిక సంబంధాలపైనా చర్చలు జరుపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతీ అంశంపైనా ఇరుదేశాల ప్రతినిధులు చర్చించుకునే ఛాన్స్ ఉందన్నారు.

భారత్, పాక్‌లు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ సదస్సు మంచి వేదికగా నిలుస్తుందని ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. ఆర్థిక, వాణిజ్యపరమైన అంశాలపైనా ఈ భేటీలో ప్రధానమైన డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాత్రం పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 


Similar News