Farmers: రైతుల నిరసన కంటిన్యూ.. కేంద్రంతో చర్చలు విఫలం !

హర్యానా-పంజాబ్‌లోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు ముగిశాయి.

Update: 2025-03-19 14:52 GMT
Farmers: రైతుల నిరసన కంటిన్యూ.. కేంద్రంతో చర్చలు విఫలం !
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: గత 13 నెలలుగా హర్యానా-పంజాబ్‌లోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య బుధవారం జరిగిన ఏడో రౌండ్ చర్చలు సైతం అసంపూర్తిగా ముగిశాయి. చండీగఢ్‌లోని సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj singh chowhan), పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ (Piyush goyal), ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM), సంయుక్త్ కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్) ప్రతినిధుల బృందాలు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఎంఎస్పీ సహా వివిధ అంశాలపై చర్చలు జరగగా ఎటువంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిశాయి. దీంతో రైతులు తమ ఆందోళనను కొనసాగించనున్నట్టు ప్రకటించారు.

రైతులతో తదుపరి సమావేశం మే 4వ తేదీన జరుగనుందని, చర్చలు సానుకూల వాతావరణంలోనే జరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే సమావేశం తర్వాత రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దుకు తిరిగి వస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అంతేగాక కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM) కన్వీనర్ పాంధర్, యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేగాక శంభు సరిహద్దులో భారీగా బలగాలను మోహరించారు. పంజాబ్ హర్యానా సరిహద్దుల నుంచి నిరసనకారులను వెళ్లగొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

Read More..

Hamas: చర్చలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి.. ఇజ్రాయెల్ దాడుల వేళ హమాస్ ప్రకటన 

Tags:    

Similar News