అమెరికా సరిహద్దుల్లో విషాదం..చలి తట్టుకోలేక కుటుంబం మృతి

Update: 2022-01-21 17:05 GMT

వాషింగ్టన్: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అక్రమంగా దేశ దాటే క్రమంలో చలి వాతావరణాన్ని తట్టుకోలేక కుటుంబమే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. వీరంతా భారతీయులని అనుమానిస్తున్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో కెనడా భూభాగం వైపు భార్య భర్తలు, ఒక యువకుడితో పాటు శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

వీరు అమెరికా లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. ఘటనపై జరిపిన విచారణలో వాతావరణం వల్ల వారు మరణించినట్లు నిర్ధారించారు. సరిహద్దు నుండి కేవలం 9-12 మీటర్ల దూరంలో వారిని గుర్తించారు. వీరు చల్లని వాతావరణాన్ని మాత్రమే కాకుండా అంతులేని నడకతో పాటు, పెద్ద మంచు తుఫానులు, చీకటి కూడా ఎదుర్కొన్నారని తెలిపారు.

Tags:    

Similar News