ఓటమికి బాధ్యతగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా!.. మాజీ ఐఏఎస్,బీజేడీ లీడర్ వీకే పాండియన్
ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్పస్తి పలుకుతున్నానని మాజీ ఐఏఎస్, బీజేడీ నాయకుడు వీకే పాండియన్ తెలిపాడు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్పస్తి పలుకుతున్నానని మాజీ ఐఏఎస్, బీజేడీ నాయకుడు వీకే పాండియన్ తెలిపాడు. సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన పాండియన్ బీజేడీ పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ.. తాను ఐఏఎస్ గా సీఎంవో కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు నవీన్ పట్నాయక్ ప్రజలకు చేస్తున్న సేవలను దగ్గరుండి గమణించానని అన్నారు. నవీన్ పట్నాయక్ ను స్పూర్తిగా తీసుకొని వాలంటరీ రిటైర్మెంట్ తో బిజు జనతా దళ్ పార్టీలో చేరానని తెలిపాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో చేయాలని తపనతో పని చేసేవాడని, అలాంటి విజనరీ నాయకుడు ఓడిపోవడం బాధకరమన్నారు. అలాగే నేను చేరిన నాటి నుంచి రాత్రి పగలు తేడా లేకుండా నవీన్ పట్నాయక్ గారి కోసం, ప్రజల కోసం పని చేశానని అన్నారు. బీజేడీలో నేను ఏ పదవి అనుభవించలేదని, కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదని స్పష్టం చేశారు.
నాకు తాతల నుంచి వచ్చిన ఇళ్లు తప్పించి ప్రపంచంలో ఏ ఆస్తి లేదని, ఐఏఎస్ గా నా ప్రస్థానం మొదలు పెట్టిన నాడు ఎంత ఆస్తి ఉందో.. ఇప్పుడు కూడా అదే ఉందని, నేను కేవలం ప్రజల ఆధారాభిమానాలు మాత్రమే సంపాదించుకున్నానని తెలిపాడు. స్పచ్చందంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చానని కానీ ఈ రోజు నాకు నేనే స్వచ్చందంగా ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అంతేగాక ఇన్నిరోజుల నా ఈ ప్రయాణంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. నాపై వచ్చిన ఆరోపణల వల్లే ఒడిశాలో బీజేడీ ఓడిపోయి ఉంటే బీజేడీ పరివార్ కు, బిజు జనతా దళ్ కార్యకర్తలకు, నాయకులకు మరో సారి క్షమాపణలు చెబుతున్నానని పాండియన్ అన్నారు.