దేశ చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి కాలం..బిర్లా వ్యాఖ్యలపై లోక్ సభలో దుమారం

లోక్​‌సభ స్పీకర్​‌గా ఎన్నికైన అనంతరం ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. స్పీకర్ ఎన్నిక అనంతరం సభలో బిర్లా మాట్లాడుడూ.. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని ఒక చీకటి కాలం అని అభివర్ణించారు.

Update: 2024-06-26 14:53 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్​‌సభ స్పీకర్​‌గా ఎన్నికైన అనంతరం ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. స్పీకర్ ఎన్నిక అనంతరం సభలో బిర్లా మాట్లాడుడూ.. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని ఒక చీకటి కాలం అని అభివర్ణించారు. ‘ఎమర్జెన్సీ దేశంలోని చాలా మంది పౌరుల జీవితాలను నాశనం చేసింది. ఎమర్జెన్సీ ప్రకటన అనంతరం చాలా మంది ప్రజలు మరణించారు. కాంగ్రెస్ నియంతృత్వ ప్రభుత్వం చేతిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నా్ం’ అని వ్యాఖ్యానించారు. ‘1975లో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమర్జెన్సీని వ్యతిరేకించి, భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను నెరవేర్చిన ప్రజలందరి దృఢ సంకల్పాన్ని అభినందిస్తున్నాం’ అని తెలిపారు.

ఆ నిర్ణయంలో భారతదేశ ప్రజాస్వామ్య విలువలు నలిగిపోయాయి, భావప్రకటనా స్వేచ్ఛను సైతం ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పీకర్ బీజేపీ ఎజెండాను నడుపుతున్నారని విమర్శించారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే స్పీకర్ ప్రకటనను ప్రధాని మోడీ సమర్థించారు. ‘స్పీకర్ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు సంతోషిస్తున్నా. ఎందుకంటే ఆ సమయంలో చేసిన అతిక్రమణలను ఎత్తిచూపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కబడిన విధానాన్ని కూడా ప్రస్తావించారు’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.


Similar News