రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్యే ఎన్నికలు: యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్

ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్యే జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

Update: 2024-05-28 14:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్యే జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాముడికి వ్యతిరేక వైఖరిని కలిగి ఉందని ఆరోపించారు. మాజీ సీఎం వీర్ బహదూర్ సింగ్‌కు రాముడిపై ఉన్న భక్తి కారణంగానే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిందన్నారు. రామమందిరాన్ని కూడా నిర్మించొద్దని చెప్పింది అని తెలిపారు. ఢిల్లీ సింహాసనంపై రామభక్తుడు మాత్రమే కూర్చుంటాడని స్పష్టం చేశారు. 1986లో వీర్ బహదూర్ సింగ్ సీఎంగా ఉన్న సమయంలో గోరఖ్‌పూర్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఈ ప్రదేశం నుంచే రామమందిరానికి తాళం వేశారని గుర్తు చేశారు. రామ మందిరాన్ని సక్రమంగా నిర్మించలేదని చెబుతోన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రజల మన్ననలను కోల్పోయిందని ఆరోపించారు. భారతదేశ విశ్వాసానికి రామమందిరం ప్రతీక అని కొనియాడారు.

Tags:    

Similar News