అవసరమైతే ఎన్‌టీఏ అధికారులపై కఠిన చర్యలు : కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో : నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు.

Update: 2024-06-20 18:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నీట్‌ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరణ ఇచ్చారు. ఈ పరీక్షలో జరిగిన తప్పులు కొన్ని ప్రాంతాలకే పరిమితమని, ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మందిపై దీని ప్రభావం ఉండదన్నారు. నీట్‌ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. పరీక్షలో అవకతవకలపై బిహార్‌ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని.. అవసరమైతే నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించబోమని చెప్పారు. విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దని కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.


Similar News