Nusrat Jahan : సినీ నటికి ఈడీ సమన్లు.. ఈ నెల 12న హాజరుకావాలని ఆదేశం
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ తాజాగా వివాదంలో చిక్కుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఫ్లాట్ విక్రయాల కుంభకోణంలో సంబంధాలు ఉన్న నెపంతో నుస్రత్ జహాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 12న కోల్‌కతాలోని ఈడీ కార్యాలయం ముందు హాజరుకావాలని ఇవాళ ఆదేశించింది. గతంలో కేవలం రూ.6 లక్షలకే త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
అయితే ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఇది వరకే కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకుడు శంకు దేబ్ పాండా ఫిర్యాదు చేయడంతో ఈడీ ఆమెపై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ దాదాపు రూ. 24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.