శివసేన ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మహారాష్ట్రలోని శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే రవీంద్ర వైకర్ ఇల్లు, అయనకు చెందిన సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది.

Update: 2024-01-09 06:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మహారాష్ట్రలోని శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే రవీంద్ర వైకర్ ఇల్లు, అయనకు చెందిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం దాడులు చేపట్టింది. ముంబై నగరంలోని జోగేశ్వరి ప్రాంతంలో విలాసవంతమైన హోటల్ నిర్మాణంలో వైకర్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఓ ప్లాట్‌లో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణానికి చట్టవిదుర్ధంగా ఆమోదం లభించిందని, అంతేగాక ఈ డీల్ వల్ల బీఎంసీకి భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ముంబైలోని దాదాపు ఏడు ప్రాంతాల్లో ఏజెన్సీ సోదాలు చేస్తోందని వారు తెలిపారు. ముంబైలోని మొత్తం ఏడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. వీటిలో ఎమ్మెల్యే రవీంద్ర, అతని అనుచరుల నివాసాలు కూడా ఉన్నాయి. కాగా, వైఖర్ జోగేశ్వరీ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

Tags:    

Similar News