నిషేధిత పీఎఫ్‌ఐకి చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసిన ఈడీ

నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ముగ్గురు సభ్యులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.

Update: 2024-03-30 10:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నిషేధిత ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)కి చెందిన ముగ్గురు సభ్యులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. అబ్దుల్ ఖాదర్ పుత్తూరు, అన్షాద్ బద్రుదిన్, ఫిరోజ్ కె ముగ్గురు కూడా (పీఎఫ్‌ఐ)కి ఫిజికల్ ట్రైనర్‌లుగా పనిచేస్తున్నారని, మనీలాండరింగ్ నిరోధక చట్టం క్రింద వీరిని అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీరు పీఎఫ్‌ఐ క్యాడర్‌కు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని, దాని కోసం ఆ సంస్థ నుంచి భారీ మొత్తంలో నిధులు పొందారని అధికారులు తెలిపారు.

పీఎఫ్‌ఐ కేరళలో 2006లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. టెర్రర్ యాక్టివిటీస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణపై సెప్టెంబర్ 2022లో కేంద్రం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) నిబంధనల ప్రకారం పీఎఫ్‌ఐని నిషేధించింది. దీని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఉగ్రవాదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చాలా కేసుల్లో ఈ సంస్థ సభ్యులు నిందితులుగా ఉన్నారు.

దీనికి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నాయని చాలా సార్లు వార్తలు వచ్చాయి. గతంలో పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యలయాల్లో సోదాలు జరపగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోదాల్లో భాగంగా దాదాపు 250 మందికి పైగా సభ్యులను, కార్యకర్తలను ఎన్‌ఐఏ ఇంతకుముందు అరెస్ట్ చేసింది. తాజాగా ఫిజికల్ ట్రైనర్‌లుగా ఉన్న వారిని మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసింది.


Similar News