ఇండియా కూటమి నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తోంది.. రాహుల్ గాంధీ

ఇండియా కూటమి నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-07-01 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమి నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడారు. తప్పుడు కేసులు పెట్టి విపక్ష నేతలను జైల్లో వేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నామన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామనే విషయం తమకు తెలుసు అని.. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాము గర్వపడుతున్నామన్నారు. తనను కూడా విచారణ పేరుతో ఈడీ వేధించిందనని.. కేంద్రం ఆదేశాలతోనే తనను టార్గెట్ చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. శివుడి ఫొటోను, రాజ్యాంగాన్ని చూపిస్తే తప్పవుతుందా అని ప్రశ్నించారు. శివుడి నుంచి తాను ప్రేరణ పొందా అన్నారు. తన ఎంపీ పదవిని, ఇంటిని కూడా లాక్కున్నారని కేంద్రంపై రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. చాలా మంది ఒక చిహ్నాన్ని వ్యతిరేకిస్తారని.. ఆ చిహ్నమే అభయముద్ర.. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తు అన్నారు. 


Similar News