ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి..

ఎడప్పాడి పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని ఏఐఏడీఎంకే పార్టీ గురువారం తెలిపింది.

Update: 2023-04-20 15:01 GMT

చెన్నై: ఎడప్పాడి పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించిందని ఏఐఏడీఎంకే పార్టీ గురువారం తెలిపింది. పార్టీ నాయకత్వం, ఇతర సమస్యలపై ఆయన ప్రత్యర్థి శిబిరం అభ్యర్థనలపై మద్రాసు హై కోర్టు విచారణను పునః ప్రారంభించిన రోజున ఇది జరిగినట్టు పార్టీ పేర్కొంది. ఎలక్షన్ కమిషన్ నుంచి సమాచారం అందుకున్న పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎం బాబు మురుగవేల్.. పళనిస్వామికి ఒక ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే బైలాస్‌కు సవరణలు, జనరల్ సెక్రెటరీ ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకాన్ని ఎలెక్షన్ కమిషన్ అంగీకరించినట్లు తెలిపారు.

తనను పార్టీ నుంచి బహిష్కరించి, పళనీస్వామికి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుతుడైన ఓ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్‌ను మద్రాస్ హై కోర్టు డివిజన్ బెంచ్ విచారిస్తున్న రోజున (ఏప్రిల్ 20వ తేదీన) ఎలక్షన్ కమిషన్ నుంచి లేఖ వచ్చింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికల నిర్వహణకు, 2022 జూలై 11న పార్టీ జనరల్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులు వేసిన పిటీషన్లను మద్రాస్ హై కోర్టు తిరస్కరించిన కొద్ది రోజులకే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి మార్చి 28న జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News