డ్రగ్స్ గుమ్మడికాయలు.. వీటి విలువ రూ.3.5కోట్లపైనే..

గుమ్మడికాయల ట్రక్కును మణిపూర్‌లోని ఫెర్జాల్ జిల్లా నుంచి అసోంలోని కాచర్‌కు తరలిస్తున్నారు

Update: 2024-04-25 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుమ్మడికాయల్లో డ్రగ్స్ దాచిపెట్టి తరలిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. వివరాల్లోకెళ్తే.. ఓ ముఠా రూ.3.5కోట్ల విలువ చేసే బ్రౌన్ షుగర్‌ను గుమ్మడికాయల్లో దాచిపెట్టి, ఆ గుమ్మడికాయల ట్రక్కును మణిపూర్‌లోని ఫెర్జాల్ జిల్లా నుంచి అసోంలోని కాచర్‌కు తరలిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న 39వ అసోం రైఫిల్స్, మణిపూర్ పోలీసుల సంయుక్త బృందం.. ఆ ట్రక్కును మణిపూర్‌లోని టిపైముఖ్‌ వద్ద అడ్డుకుంది. ఆ గుమ్మడికాయలను తనిఖీ చేసి వాటిలోంచి 363.45గ్రాముల నార్కొటిక్స్‌ను స్వాధీనం చేసుకుంది. అబ్దుల్ మన్నన్, ఖలీల్ ఉల్లా అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. అనంతరం తదుపరి విచారణ కోసం వారిని జిరిబం పోలీస్ స్టేషన్‌కు తరలించింది. సీజ్ చేసిన బ్రౌన్ షుగర్ విలువ రూ3.5 కోట్ల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనిపై మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, అసోం రైఫిల్స్ బృందం, జిరిబం పోలీసులను అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారాన్ని ఎదుర్కోవడంలో అద్భుతమైన పనితీరును కనబర్చారని ప్రశంసించారు.



Similar News