తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేసిన DRDO, IIT-ఢిల్లీ

రక్షణ దళాల కోసం DRDO, IIT-ఢిల్లీ కలిసి సంయుక్తంగా తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేశాయి

Update: 2024-09-25 14:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రక్షణ దళాల కోసం DRDO, IIT-ఢిల్లీ కలిసి సంయుక్తంగా తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేశాయి. ఇది ముందు, వెనుక మొత్తం 360 డిగ్రీల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇండస్ట్రీ అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (DIA-CoE)లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీకి చెందిన పరిశోధకులు కలిసి 'ABHED' (అధునాతన బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డీఫీట్) అనే ఈ తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లను అభివృద్ధి చేశారు. దీని ఉత్పత్తిని పెంచడానికి ఈ సాంకేతికతను దేశీయంగా మూడు కంపెనీలకు బదిలీ చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాకెట్లను పాలిమర్లు, స్వదేశీ బోరాన్ కార్బైడ్ సిరామిక్ పదార్థం నుండి తయారు చేశారు. కనీస బరువు 8.2 కిలోల నుంచి 9.5 కిలోల మధ్య ఉంటుంది. రక్షణ సిబ్బంది ధరించడానికి సులువుగా ఉండటంతో పాటు, అన్ని వైపుల నుంచి రక్షణ కల్పిస్తుందని అధికారులు తెలిపారు. ఈ జాకెట్లు అన్ని R&D ట్రయల్స్‌లో ఉత్తీర్ణత సాధించాయి. ఆర్ అండ్ డీ, చైర్మన్, DRDO, సమీర్ V కామత్ మాట్లాడుతూ, దీని అభివృద్ధి కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. రక్షణ పరిశోధన, అభివృద్ధిలో పరిశ్రమ, విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయడానికి 2022లో DIA-CoEను ఏర్పాటు చేశారు.


Similar News