China : చైనా విదేశాంగ మంత్రితో అజిత్ దోవల్ భేటీ.. సరిహద్దు సమస్యపై కీలక చర్చ

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు.

Update: 2024-09-12 16:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏల సదస్సు సందర్భంగా వీరు సమావేశమయ్యారు. చైనా-భారత్ మధ్య గత కొన్నేళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదంపై దోవల్, వాంగ్ యీ చర్చించారు.

ఇరుదేశాలు సరిహద్దు సమస్యను పరిష్కరించుకొని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరంపై వారు మాట్లాడుకున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)తో ముడిపడిన సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటే.. చైనా-భారత్ సంబంధాలు పూర్వస్థితికి చేరుకుంటాయని దోవల్, వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ దిశగా ఇరుదేశాలు వేగవంతమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. 


Similar News