కరువు పని డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
ప్రస్తుతం పల్లెలో ఎక్కడ చూసినా ఉపాధి హామి పథకం పనులకు వెళ్తున్నవారే కనిపిస్తున్నారు. ఇక పేదలకు పని కల్పించి, ఆర్థిక భరోసానివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా పేదలకు 100 రోజులు పని కల్పించడం
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం పల్లెలో ఎక్కడ చూసినా ఉపాధి హామి పథకం పనులకు వెళ్తున్నవారే కనిపిస్తున్నారు. ఇక పేదలకు పని కల్పించి, ఆర్థిక భరోసానివ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా పేదలకు 100 రోజులు పని కల్పించడం తప్పని సరి .ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారిగా కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 2023కి సంబంధించి రూ.257 రూపాయలను చెల్లించాలి. కానీ కేవలం రూ.240 మాత్రమే చెల్లిస్తుంది. అయితే ఈ పథకం పని పైసలు పడ్డాయో లేదో తెలుసుకోవడం చాలా మందికి తెలియదు. దీంతో వారు పని చేయించే లీడర్స్‌ను ఎప్పుడూ అడుగుతుంటారు.
అయితే ఈ కరువు పని పైసలు పడ్డాయో లేదో ఈజీగా తెలుసుకోవచ్చంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
పథకం లబ్ది పొందాల్సిన వ్యక్తి తొలుత అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
http://nrega.nic.in/Nregahome/MGNREGA-new/Nrega-home.aspx.
హోమ్ పేజీలోకి వెళ్లి Job Carsds లింక్ పై క్లిక్ చేయాలి.
ఆ Job Carsds లోకి వెళ్లిన తరువాత మీ స్వంత రాష్ట్రం, తెలంగాణ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్రం పేజీ ఓపెన్ అయిన తరువాత, అందులో ఏ సంవత్సరం, ఏ జిల్లా, ఏ బ్లాక్, ఏ పంచాయితీ వివరాలను ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాలి
మీరు ఎంటర్ చేసిన పంచాయితీలో ఉన్న లబ్దిదారులందరి పేర్లు వస్తాయి. అందులో మీ పేరును Job Card నంబర్ తో సులభంగా సెర్చ్ చేసుకోండి
మీ జాబ్ కార్డ్ నంబర్ పై క్లిక్ చేయగానే మీ జాబ్ కార్డ్, పని చేసిన కాలం, ఏ పని చేశారనే దానికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అక్కడే ఓ రెడ్ లింక్ ఉంటుంది. దాని పై క్లిక్ చేయగానే పని తేది, పని చేసిన స్థలం, రోజులు, అమౌంట్ కు సంబంధిచిన పూర్తి వివరాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది.