సభనే కాదు.. మర్యాదను కూడా వదిలిపెట్టారు- ప్రతిపక్షాలపై రాజ్యసభ ఛైర్మన్ ఘాటు వ్యాఖ్యలు

ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్మవాదాలు తెలిపే తీర్మనంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడారు.

Update: 2024-07-03 09:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్మవాదాలు తెలిపే తీర్మనంపై ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడారు. కాగా.. మోడీ మాట్లాడుతుండా విపక్షాలు గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. ఆందోళన మధ్యే ప్రధాని ప్రసంగం కొనసాగించారు. దీంతో, ప్రతిపక్ష ఎంపీలందరూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల చర్యపై ఎగువసభ ఛైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగదీప్ ధన్ ఖర్ మాట్లాడుతూ " ఈ చర్య తీవ్రంగా బాధించింది. వారు సభనే కాదు.. వారి మర్యాదను కూడా వదిలిపెట్టారు. వారు నన్ను అగౌరవపరచలేదు కానీ.. రాజ్యాంగాన్ని, తమని తాము అవమానించుకున్నారు. ఈ అగౌరవం కన్నా దారుణం మరోటి లేదు ”అని మండిపడ్డారు. ప్రతిపక్షాలన్నీ రాజ్యాంగాన్ని అవమానించాయని ఆరోపించారు. ఛైర్మన్ పదవిలో కూర్చొని ఇలాంటి అగౌరవాన్ని చూసి ఆవేదన చెందానని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని హేళన చేశారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం అంటే.. అది మీ చేతిలో పట్టుకునే పుస్తకం మాత్రమే కాదు.. జీవితానిక మార్గదర్శకం అని పేర్కొన్నారు.


Similar News