చైనాతో మరోసారి వివాదం.. భారత్ సంచలన నిర్ణయం

చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లకు వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ను నిరాకరించినట్లు తెలిసింది.

Update: 2023-09-22 10:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలో జరగనున్న 19వ ఆసియా క్రీడలకు సంబంధించి భారత్‌కు చెందిన క్రీడాకారులపై చైనా వివక్ష చూపుతోందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లకు వీసాలతోపాటు అక్రిడిటేషన్‌ను నిరాకరించినట్లు తెలిసింది. దీనిపై తాజాగా భారత్‌ ప్రతిస్పందించింది. చైనాలోని హాంగ్‌జౌలో రేపు జరుగనున్న ఆసియా గ్రేమ్స్‌ ప్రారంభ వేడుకలో పాల్గొనకూడదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇవాళ మీడియాకు తెలిపారు. కాగా, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని చైనా అధికార మ్యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రాంతం, జాతి ఆధారంగా భారతీయ పౌరుల పట్ల చైనా వివక్ష చూపడాన్ని నిరాకరిస్తున్నట్లు భారత్ తెలిపింది. అయితే ఈనెల 23న ఏషియన్ గేమ్స్‌ అధికారిక ప్రారంభ వేడుక జరగనున్నాయి. అక్టోబర్ 8 వరకు క్రీడలు కొనసాగనున్నాయి.

Tags:    

Similar News