పుల్వామా ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యమే.. దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

పుల్వామా ఉగ్రదాడి జరిగి 4 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-14 16:44 GMT

భోపాల్: పుల్వామా ఉగ్రదాడి జరిగి 4 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్ర ఘటన ఇంటిలిజెన్స్ వైఫల్యమే కారణమని అన్నారు. నిఘా వైఫల్యమే 40 మంది జవాన్ల మరణానికి కారణమైందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అమరవీరుల కుటుంబాలు తగిన సహాయం పొందారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మండిపడ్డారు. ఆయన పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. దిగ్విజయ్ మతి పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

దేశ ఆర్మీని అవమానిస్తూ పాకిస్తానీ భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీని తక్కు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ పెద్దలు కలుగజేసుకోవాలని కోరారు. అంతకుముందు కూడా దిగ్విజయ్ సింగ్ పుల్వామా ఘటనలో ఆధారాలు చూపించలేదని కేంద్రం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. అవి దిగ్విజయ్ వ్యక్తిగతమని పేర్కొంది.

Tags:    

Similar News