భర్త నుంచి వచ్చే భరణంపై ఆధారపడటం సరికాదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

సాధారణంగా భర్త నుంచి భార్య విడాకులు తీసుకున్నప్పుడు భరణంగా ఎంతో కొంత చెల్లిస్తుంటారు.

Update: 2024-09-12 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా భర్త నుంచి భార్య విడాకులు తీసుకున్నప్పుడు భరణంగా ఎంతో కొంత చెల్లిస్తుంటారు. అయితే చాలామంది దీనినే అదును చేసుకుని ఎక్కువ భరణం పొంది వారు ఎలాంటి పనులు చేయకుండా ఈ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉన్నత చదువులు ఉండి కూడా ఏ పని చేయకపోవడం సరికాదని వెల్లడించింది. అయితే నెలకు రూ. 60వేల భరణం సరిపోదని, పెంచాలని భార్య హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏ కారణం లేకుండానే ఆమె విడిగా ఉంటుందని.. గతంలో ఉద్యోగం చేసిందని.. బ్యూటీ పార్లర్ నడుపుతూ కూడా బాగానే సంపాదిస్తోంది.. కాబట్టి భరణం తగ్గించండి అంటూ భర్త వాదించాడు. ఇక భర్త వాదనలు విన్న మద్రాసు హైకోర్టు భార్యకు ఇచ్చే భరణాన్ని రూ. 40 వేలకు తగ్గించింది.


Similar News