ఢిల్లీకి రావాల్సిన నీటిని విడుదల చేయాల్సిందే: కొనసాగుతున్న అతిశీ నిరాహార దీక్ష

దేశ రాజధాని ఢిల్లీకి దక్కాల్సిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-06-24 07:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీకి దక్కాల్సిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్ష సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన సరైన నీటి వాటాను రిలీజ్ చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని అతిశీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘నా రక్తపోటు, చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. నా బరువు కూడా తగ్గింది. కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఇది హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. కానీ నా శరీరం ఎంత బాధపడినా, హర్యానా నీటిని విడుదల చేసే వరకు దీక్ష విరమించేదే లేదు’ అని తెలిపారు. ఢిల్లీ ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. హర్యానా గత మూడు వారాలుగా యమునా నీటిలో ఢిల్లీ వాటాను రోజుకు 100 మిలియన్ గ్యాలన్లు తగ్గించిందని ఆరోపించారు. కాగా, హర్యానా నుంచి ప్రతిరోజూ 613 మిలియన్ గ్యాలన్ల నీరు ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే కేవలం 513 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే ఇస్తుందని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.


Similar News