ఢిల్లీ లిక్కర్ కేసు: మనీశ్ రిమాండ్ ను రిజర్వ్ చేస్తూ కోర్టు ఉత్తర్వులు

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియా రిమాండ్ ను రిజర్వ్ చేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-02-27 11:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియా రిమాండ్ ను రిజర్వ్ చేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆదివారం సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం మనీశ్ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ అధికారులు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాది కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం మనీశ్ సిసోడియా ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే సీబీఐ రిమాండ్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సిసోడియా తరఫున న్యాయవాది కృష్ణన్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. మనీశ్ సిసోడియా అరెస్ట్ రిమాండ్ ను రిజర్వ్ చేస్తూ తీర్పు వెలువరించింది. 

Tags:    

Similar News