Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ ను పొడిగించింది.

Update: 2023-07-24 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ ను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మధ్యంతర బెయిల్ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో జైలులో ఉండగా సత్యేంద్ర జైన్ బాత్ రూమ్ లో కుప్పకూలి పడిపోయారు. దాంతో గత మే నెలలో సుప్రీంకోర్టు ఆయనకు వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజా ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read More : అంబేద్కర్ ఫొటో కాదు.. TN కోర్టులలో కేవలం గాంధీ, తిరువళ్ళువర్ ఫొటోలు మాత్రమే ఉండాలి

Tags:    

Similar News