1984 anti-Sikh riots case: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ పై నేరాభియోగం నమోదు

1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ కు చుక్కెదురైంది. ఆయనపై నేరాభియోగం నమోదు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Update: 2024-09-13 10:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్ కు చుక్కెదురైంది. ఆయనపై నేరాభియోగం నమోదు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హత్యతో పాటు, ఇతర నేరాల కింద అభియోగాలు మోపింది. టైట్లర్ నిర్దోషి అని ఆ అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని అతని తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కానీ.. ఆ కేసులో టైట్లర్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పెషల్ జడ్జి జస్టిస్ రాకేశ్ సియాల్ వెల్లడించారు. నిందితుడైన టైట్ల‌ర్‌పై విచారణ తగిన ఆధారాలున్నాయని ఆగ‌స్టు 30వ తేదీన ఇచ్చిన తీర్పులో జ‌డ్జి పేర్కొన్నారు.

1984లో ఏం జరిగిందంటే?

1984 న‌వంబ‌ర్ 1న పుల్ బంగాష్ గురుద్వారా చేరుకున్న టైట్ల‌ర్‌.. అంబాసిడ‌ర్ కారు నుంచి దిగిన త‌ర్వాత అక్క‌డ ఉన్న వారిని రెచ్చ‌గొట్టార‌ని ఛార్జిషీటులో ఉంది. సిక్కుల‌ను చంపండి , వాళ్ల మ‌న త‌ల్లిని చంపార‌ని ఆ గుంపును ప్రేరేపించారని ప్రత్యక్షసాక్షిచేసిన ఫిర్యాదులో ఉంది. టైట్లర్ రెచ్చగొట్టడం వల్లే ముగ్గురు చనిపోయారని ఛార్జిషీట లో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం, ఇళ్లలోకి అక్రమంగా చొరబడడం, చోరీ సహా వివిధ నేరాలకు సంబంధించిన అభియోగాలను రూపొందించాలని కోర్టు ఆదేశించింది.


Similar News