Arvind Kejriwal : తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన పంజాబ్ సీఎం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూన్యా ఇద్దరూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు.

Update: 2024-09-13 13:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూన్యా ఇద్దరూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. దీనికి ముందు, ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుండి బెయిల్ కూడా పొందారు. తాజాగా.. శుక్రవారం సాయంత్రం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆప్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అంతేకాదు.. కేజ్రీవాల్‌కు జైలు ఎదుట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వాగతం పలికారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు కాగా, జూన్ 26న తిహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. దాదాపు ఐదున్నర నెలల పాటు కేజ్రీవాల్‌ తిహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News