సుజుకీ మోటార్స్ మాజీ ఛైర్మన్ కన్నుమూత
సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94)(Former Chairman Osamu Suzuki) కన్నుమూశారు.
దిశ,వెబ్‌డెస్క్: సుజుకీని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ సంస్థ మాజీ ఛైర్మన్ ఓసాము సుజుకీ(94)(Former Chairman Osamu Suzuki) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 25న తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. జపాన్‌కు మాత్రమే పరిమితమైన ఆటోమొబైల్ కంపెనీని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఓసాము సుజుకీ కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల పాటు సుజుకీ ఛైర్మన్‌గా(Chairman of Suzuki) సేవలందించారు. 1958లో సుజుకీ మోటార్స్‌లో చేరిన ఆయన 1978లో ప్రెసిడెంట్ అయ్యారు. తర్వాత 2000లో కంపెనీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 2 పర్యాయాలు కలిపి, ఆయన ఏకంగా 28 ఏళ్ల పాటు కంపెనీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ఓ ఆటోమొబైల్ కంపెనీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన వాడిగా ఒసాము సుజుకీ నిలిచారు. 2021లో తన 91 ఏట ఆయన స్వయంగా రిటైర్‌మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌లో మారుతీ సుజుకీ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది.