Wayanad landslides: ఘోర విషాదం.. 18 కి చేరిన మృతుల సంఖ్య

కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ లోని మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి.

Update: 2024-07-30 04:07 GMT

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్ లోని మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి 4 గంటల సమయంలో ఒక్కసారిగా బురదతో కూడిన కొండచరియలు స్థానిక నివాసాలపై దూసుకొచ్చాయి. దీంతో వందల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుని పోయారు. ఈ ప్రమాదంలో ప్రాథమిక నివేదిక ప్రకారం ఏడుగురు మృతి చెందినట్లు తెలపగా.. సహాయక చర్యలు చేపడుతున్నా కొద్ది మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే 18 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం భారీ వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పలు మృతదేహాలు మాత్రం కొండచరియలతో పాటు వరదలో కొట్టుకు వస్తున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంపై భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


Similar News