Gaza:ఉత్తరగాజాలో ప్రతి ఒక్కరికీ ముప్పు

ఉత్తరగాజాలో ప్రజలు ఎవరైనా.. ఎప్పుడైనా మరణించొచ్చని ఐరాస హెచ్చరించింది. ఒక వైపు యుద్ధం, మరోవైపు కరువు, వ్యాధులు ప్రజలను మృత్యు అంచులకు నెట్టుతున్నాయని పేర్కొంది.

Update: 2024-11-01 20:14 GMT
Gaza:ఉత్తరగాజాలో ప్రతి ఒక్కరికీ ముప్పు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేశాక ఈ యుద్ధానికి తెరపడుతుందని ఆశించారు. అమెరికా కూడా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అందుకోసం సీరియస్‌గా పని చేస్తుందని అనుకున్నారు. కానీ, ఇజ్రాయెల్ మళ్లీ గాజా, లెబనాన్‌లపై దాడులు మొదలు పెట్టడంతో యుద్ధ విరమణ ఆశలు ఆవిరయ్యాయి. గాజాలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోతున్నాయి. ఉత్తరగాజాలో ప్రజలు ఎవరైనా.. ఎప్పుడైనా మరణించొచ్చని ఐరాస హెచ్చరించింది. ఒక వైపు యుద్ధం, మరోవైపు కరువు, వ్యాధులు ప్రజలను మృత్యు అంచులకు నెట్టుతున్నాయని పేర్కొంది. ఉత్తర గాజాలో ప్రజలకు అవసరమైన స్థాయిలో మానవతా సహాయం అందకుండా అడ్డుకోవడం, కనీస సదుపాయాలకూ వారు నోచుకోవడం లేదని వివరించింది. జీవించడానికి అవసరమైన బేసిక్ మెటీరియల్స్ కూడా అందడం లేదని తెలిపింది. గాజా వాసులకు సహాయం అందించే వారికీ అక్కడ రక్షణ లేకుండా పోవడం, అలాగే.. ఇజ్రాయెలీ సైనికుల బీభత్సాలతో తీవ్ర సమస్యలు ఉన్నవారూ సహాయం కోసం బయటికి రావడానికి జంకుతున్నారని పేర్కొంది. గత నెలలో ఇజ్రాయెల్ సైన్యం ఉత్తరగాజాలోనూ ఆపరేషన్‌ను తీవ్రతరం చేసింది.

Tags:    

Similar News