Odisha : ఇద్దరు ప్రియురాళ్లతో కలిసి భార్యను కడతేర్చిన కీచకుడు

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వ్యక్తి తనతో వివాహేతర సంబంధమున్న ఇద్దరు మహిళలతో కలిసి భార్యను కడతేర్చాడు.

Update: 2024-11-01 18:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వ్యక్తి తనతో వివాహేతర సంబంధమున్న ఇద్దరు మహిళలతో కలిసి భార్యను కడతేర్చాడు. ఈ హత్య అక్టోబరు 28న ఒడిశా(Odisha)లోని భువనేశ్వర్‌(Bhubaneswar)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రద్యుమ్న కుమార్ దాస్‌కు మరో ఇద్దరు మహిళలతో అఫైర్ ఉందనే విషయం భార్య శుభశ్రీకి తెలిసిపోయింది. దీంతో ప్రద్యుమ్న కుమార్, శుభశ్రీ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా శుభశ్రీ పుట్టినింటిలో ఉంటోంది. ఈక్రమంలో భార్య శుభశ్రీకి ఫోన్ చేసి మాట్లాడిన ప్రద్యుమ్న కుమార్.. తన ప్రియురాలు రోసీ ఉండే ఇంటి వద్దకు పిలిపించాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత రోసీ, ప్రద్యుమ్న కలిసి.. శుభశ్రీకి బలవంతంగా రెండు అనస్తీషియా ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన శుభశ్రీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని డాక్టర్లకు చెప్పాారు. శుభశ్రీని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె చనిపోయిందని వెల్లడించారు. అదేరోజు పోలీసులకు కూడా దీనిపై ప్రద్యుమ్న సమాచారాన్ని అందజేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, శుభశ్రీ డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆమె చేతులు, మెడ భాగాల్లో చర్మం కింద రక్తం పేరుకుపోయి ఉండటాన్ని పోస్టుమార్టం రిపోర్టులో ప్రస్తావించారు. ఎవరైనా బలంగా పట్టుకున్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంటుందని తెలిపారు. అనస్తీషియా ఓవర్ డోస్ వల్లే శుభశ్రీ మరణం సంభవించిందని తేల్చారు. దీనిపై ప్రద్యుమ్న కుమార్‌ను పోలీసులు విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. అనస్తీషియా ఇంజెక్షన్లను ఒక ప్రేయసి సమకూర్చగా.. మరో ప్రేయసి మర్డర్ చేయడంలో తనకు సహకరించిందని వెల్లడించాడు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News