భారత్‌లో ప్రపంచ సగటు కంటే రెట్టింపు సైబర్ దాడులు

ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో సైబర్ దాడుల ఘటనలు దాదాపు రెండింతలు పెరిగాయని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఎంయూ నాయర్ అన్నారు.

Update: 2023-11-19 10:07 GMT

బెంగళూరు: ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో సైబర్ దాడుల ఘటనలు దాదాపు రెండింతలు పెరిగాయని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఎంయూ నాయర్ అన్నారు. ఆదివారం సినెర్జియా కాన్‌క్లేవ్-2023 కార్యక్రమంలో 'అలైన్ టెక్నాలజీస్ టూ ఫ్యూచర్ కాన్‌ఫ్లిక్టస్ ' సెషన్‌లో పాల్గొన్న ఆయన, గడిచిన 10 నెలల్లో సగటున రూ. 12.75 వేల కోట్ల రాన్సమ్‌వేర్ దాడుల చెల్లింపులు జరిగాయని, ఇది 2022 నుంచి రెట్టింపు అయ్యిందని చెప్పారు. ఈ చెల్లింపులు సముంద్రంలోని మంచుకొండపై కనబడే కొన లాంటిదని, ఇంకా అనేక సైబర్ దాడులు అధికారికంగా నివేదించబడలేదని ఆయన వెల్లడించారు. గత ఆరు నెలల్లో దేశీయ సైబర్‌స్పేస్ సగటున వారానికి 2,126 సార్లు సైబర్ దాడులను చూసిందని, ఇది ప్రపంచ సగటు 1,108 కంటే చాలా ఎక్కువని నాయర్ తెలిపారు. సైబర్‌స్పేస్‌లో ఇలాంటి దాడులను నియంత్రించడానికి, కట్టడికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News