CUTE-UG Exam: సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేసిన యూజీసీ..!

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్(UG) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-యూజీ(CUTE-UG) ప్రవేశ పరీక్షలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-10 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్(UG) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-యూజీ(CUTE-UG) ప్రవేశ పరీక్షలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ పరీక్షలు ఇంతకముందు హైబ్రిడ్ మోడ్(Hybrid Mode)లో నిర్వహించే వాళ్లు కానీ, 2025 నుంచి కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలోనే ఈ ఎగ్జామ్స్ కండక్ట్(Conduct) చేయనున్నట్లు యూజీసీ వెల్లడించింది. అలాగే ఈ పరీక్షలో సబ్జెక్టుల్ని(Subjects) 63 నుంచి 37కు కుదిస్తున్నట్లు, ఇక నుంచి విద్యార్థులకు గరిష్టంగా 5 సబ్జెక్టులకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. మరోవైపు గతంలో సబ్జెక్టు బట్టి ఎగ్జామ్ టైం(Exam Time) 45 నిమిషాల నుంచి 60 నిమిషాలుగా ఉండేది. ప్రస్తుతం ఆ టైమును 60 నిమిషాలుగా నిర్ణయించడంతో పాటు ఆప్షనల్ ప్రశ్నల కాన్సెప్ట్(Concept)ను క్యాన్సల్ చేస్తున్నామని పేర్కొంది. వీటితో పాటు విద్యార్థులు ఇక నుంచి ఇంటర్మీడియేట్(Intermediate)లో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా యూజీలో ఏ సబ్జెక్టునైనా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది. సీయూఈటీ-యూజీ ప్రవేశ పరీక్షలో చేసే మార్పులపై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమీక్షించిందని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్(Jagadish Kumar) ఓ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News