సీయూఈటీ(యూజీ) 2024 ఆన్సర్ కీలో తప్పులున్నాయని అభ్యర్థుల ఫిర్యాదులు

అందులోని సమాధానాలు తప్పుగా ఉన్నాయని సోమవారం సీయూఈటీ యూజీకి హాజరైన పలువురు అభ్యర్థులు ఆరోపించారు.

Update: 2024-07-08 17:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (సీయూఈటీ) యూజీ 2024 ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. అయితే, అందులోని సమాధానాలు తప్పుగా ఉన్నాయని సోమవారం సీయూఈటీ యూజీకి హాజరైన పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఆదివారం కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) అభ్యర్థులు పరీక్షల నిర్వహణపై లేవనెత్తిన ఫిర్యాదులు ఏవైనా సరైనదని తేలితే జూలై 15-19 తేదీల్లో తిరిగి పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు సమాధానాలపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో జూలై 9 సాయంత్రం 5 గంటలలోగా ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయవచ్చని ప్రకటించింది. దీనిపై పలువురు అభ్యర్థులు ఎక్స్ ద్వారా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. 'నేను సీయూఈటీ యూజీ ఆన్సర్ కీలో చాలావాటికి ఎర్రర్‌లను కనుగొన్నాను. నేను అన్ని లోపాలపై అభ్యంతరం తెలపాలంటే సీయూఈటీ అప్లికేషన్‌కు అయిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ' అని ఓ అభ్యర్థి ట్వీట్ చేశాడు. మరో అభ్యర్థి.. నేను నా ఓఎంఆర్ షీట్‌ను సీయూఈటీ (యూజీ) ఆన్సర్ కీతో సరిచూసుకున్నాను. ఆన్సర్ కీలో 80 శాతం తప్పుగా ఉండటం చూసి షాక్ అయ్యాను. ఎన్‌టీఏ అందించిన తప్పుడు ఆన్సర్ కీతో లెక్కిస్తే నాకు 26 మాత్రమే వచ్చాయి. కానీ వాస్తవానికి నా 17 ప్రశ్నలు సరైనవిగా ఉన్నచోట 122 వస్తుంది. ఎన్‌టీఏ ఆన్సర్ కీలో సమాధానాలు తప్పుగా ఉన్నాయి. మీ తప్పుకు ఎవరు వేలాది రూపాయలు చెల్లిస్తారు? అంటూ ప్రశ్నించాడు.


Similar News