కేజ్రీవాల్ పక్క సెల్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్.. ఎంతమంది ఉన్నారంటే?
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఈయన ఉన్న పక్క సెల్ (జైలు నెంబర్’) లో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నీరజ్ జవానా, ఉగ్రవాది జియావుర్ రెహమాన్ ఉన్నారు. గ్యాంగ్ స్టర్ అయిన నీరజ్ బవానాపై ప్రస్తుతం 40 కి పైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులున్నాయి. అలాగే ఛోటా రాజన్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం కు సన్నిహితుడు. ఈయనకు తీవ్ర ప్రత్యర్థిగా మారడానికి ముందు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఛోటా రాజన్ 2018 లో జర్నలిస్టు జేజ డే హత్య కేసులో దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో ఛోటా రాజన్ కేజ్రీవాల్ పక్క సెల్లో జీవితఖైదీగా అనుభవిస్తు్న్నారు. వీరితో పాటు కేజ్రీవాల్ పక్క సెల్లో ఉగ్రవాది అయిన జియావుర్ రెహ్మాన్ ఇండియన్ ముజామిదీన్ ఉన్నారు. ఇంతమంది తీవ్రమైన నేరాలు చేసిన వారి పక్క సెల్లో ఢీల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఉంచడం గమనార్హం. ఇకపోతే ఇదే కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీషా సిసోడియా జైలు నెంబర్ ఒకటో నెంబర్ లో ఉంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మహిళా జైలులో నెంబర్ 6 లో ఉంది.